వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆండ్రాయిడ్ ఫోన్‌లో బెస్ట్ అప్లికేషన్స్ రన్ చేయాలంటే రూటింగే కరెక్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Android OS
ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రస్తుతం యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న మొబైల్ పోన్స్. మార్కెట్ లోకి ఇబ్బడి ముబ్బడిగా విడుదలవుతున్నటువంటి ఆండ్రాయిడ్ పోన్స్‌లలో మంచి ఫీచర్స్ ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్‌ని సోంతం చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మార్కెట్‌లో ఓ పెద్ద సమస్యగా మారింది. మొబైల్ కొన్న తర్వాత రూట్ యాక్సెస్ ద్వారా కొత్త కొత్త అప్లికేషన్స్ మన మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలా అనేది కూడా తెలిసుండాలి. చాలా మందికి ఆండ్రాయిడ్ ఫోన్స్‌లలో ఈ రూటింగ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు.

రూటింగ్ అంటే ఏమి లేదండీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అడ్మినిస్ట్రేటర్స్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సూడో లాగా అన్నమాట. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రూట్ యాక్సెస్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్‌ని, కస్టమ్ సర్వీసెస్‌ని ఇనిస్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం కస్టమ్ రామ్‌ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇనిస్టాల్ చేయడం కన్నా, దానిని రూటింగ్ చేయడం చాలా సులభం. కస్టమ్ రామ్‌ని ఇనిస్టాల్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఫీచర్స్‌‌‌ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఏమేమి ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయో ఒకసారి చూద్దాం...

* బిజి బాక్స్ యాడ్స్ ట్రూ లైనక్స్ కమాండ్స్

బిజి బాక్స్ కి మరోపేరు స్విస్ ఆర్మీ ఎంబెడెడ్ లైనక్స్. ఇది ఓరిజినల్ లైనక్స్ కమాండ్ కాకపోయినప్పటికీ దీని ద్వారా మనం అన్ని లైనక్స్, యునిక్స్ కమాండ్స్‌ని రన్ చేసుకోవచ్చు. కమాండ్స్‌ని ఇనిస్టాల్ చేయకుండానే ఆండ్రాయిడ్‌లో లైనక్స్‌ని రన్ చేయవచ్చు.


* వై - ఫై హుస్ట్‌గా వైర్‌లెస్ టెధర్

వైర్‌లెస్ టెధర్ దీని గురించి చెప్పాలంటే మొబైల్ డివైజెస్‌లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఎల్లప్పటికీ వాడుకలో ఉంటుంది. వైర్‌లెస్ టెధర్‌ అప్లికేష‌న్‌ని ఆండ్రాయిడ్‌లో ఉంచడం వల్ల మనకు దగ్గరలో ఉన్నటువంటి వై - ఫై డివైజెస్‌ని ఈజీగా కనిపెట్టిగలిగే సామర్ద్యం దీనికి ఉంటుంది.


* ఫోన్ స్పీడ్, బిహేవియర్ కనుక్కోవడానికి సిపియు కంట్రోల్స్

ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాసెసర్ స్పీడ్‌ని కంట్రోలింగ్ చేయడానికి మనం ఉపయోగించే టూల్ సెట్ సిపియు టూల్. దీని వల్ల యూజర్ ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రాసెసర్ ఎంత స్పీడ్‌, స్లోగా పని చేస్తుందని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా స్క్రీన్ ఆగిపోయినప్పుడు ఈ సెట్ సిపియుని ఉపయోగించి సరిచేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా స్క్రీన్ రేంజి 240MHz and 806MHz వరకు మనం సెట్ చేయవచ్చు. సెట్ సిపియు ఆఫ్షన్ వల్ల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్చమ్ ఉష్ణోగ్రతను కూడా మనం గ్రహించవచ్చు.


* టాస్కర్

టాస్కర్ అనేది ఓ వింత అయినటువంటి ఫీచర్. టాస్కర్‌ని రన్ చేయాలంటే ఎటువంటి రూట్ యాక్సెస్ అవసరం లేదు. మీ ఫోన్‌లో కొంత పవర్‌ ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి అఫ్లికేషన్స్‌కు వాడాలనుకుంటే ఆ సమయంలో మీరు టాస్కర్‌ని వాడోచ్చు. ఐతే దీనికి మాకత్రం మీరు రూట్ యాక్సెస్ వాడాల్సి ఉంటుంది.


*ఇంటర్నెట్ ట్రాఫిక్‌ని ఎస్‌ఎస్‌హెచ్ టన్నెల్ ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు

ఇటీవల కాలంలో కొత్తగా యాడ్ చేసినటువంటి అప్లికేషన్ ఎస్‌ఎస్‌హెచ్ టన్నెల్. ఈ టన్నెల్ అప్లికేషన్ ద్వారా ఇంటర్నెట్‌ని చాలా సెక్యూర్‌గా కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించారు. దీని ఉపయోగం ఏమిటంటే మీరు ఎప్పుడైనా డేటా సిగ్నల్‌ని రిసీవ్ చేసుకోలేకపోయినా, మీరు పబ్లిక్ వై - ఫై లో నిలచిపోయినప్పుడు మీకు అత్యంత రహాస్యమైనటువంటి ఫేస్‌బుక్, జీ మెయిల్ సమాచారాన్ని ఎవరూ దోంగిలించలేరు.

English summary
Whether you plan on installing custom ROMs or not, you may want to root your phone just to use the great apps that require root access. Here are the ten most essential apps available for Android that require root.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X