హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపస్మారక స్థితిలోనే మౌనిక: నిమ్స్‌లో ప్రత్యేక చికిత్స అందిస్తున్న వైద్యులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal District
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని జఫర్‌ఘడ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో మంగళవారం బాబు అనే కామాంధుడి చేతిలో గాయపడ్డ ఇంటర్మీడియెట్ విద్యార్థిని మౌనిక ఇప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. బాబు అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో మౌనిక అడ్డుకోబోయింది. కోపోద్రిక్తుడైన బాబు ఆమె తలపై సుత్తితో బలంగా మోదాడు. దీంతో ఆమె తలపై తీవ్ర గాయం అయిన విషయం తెలిసిందే. సుత్తితో బలంగా మోదిన కారణంగా ఆమెకు నిమ్స్ హాస్పిటల్ వచ్చే వరకు తీవ్ర రక్తస్రావం అయింది. బాబు చేతిలో గాయపడ్డ మౌనికను మొదట వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌కు తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తీసుకు వచ్చారు. అప్పటి నుండి వైద్యులు మౌనికకు ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నారు. న్యూరో సర్జన్ ఆమెను పరిశీలించి శస్త్ర చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకొని శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది.

English summary
Warangal district sexual harassment victim Mounika in coma till now. She sent to NIMS for special hospitality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X