చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిఎస్ఎన్ఎల్‌ను లూటీ చేసిన మారన్, ఇంటికి 322 టెలిఫోన్ లైన్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dayanidhi Maran
చెన్నై: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొట్టిన టెలికం మాజీ మంత్రి ఎ రాజాకు ముందు డిఎంకె నేత దయానిధి మారన్ బిఎస్ఎన్ఎల్‌ను లూటీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టెలికం మంత్రిగా తన హోదాను వాడుకుని ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి బిఎస్ఎన్‌ఎల్‌కు తీవ్ర నష్టం కలిగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాను టెలికం మంత్రిగా ఉన్నప్పుడు దయానిధి మారన్ చెన్నైలోని తన ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు ఇవ్వడానికి ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజీని బిఎస్ఎన్ఎల్‌పై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆ టెలిఫోన్ లైన్లను అధికార ప్రయోజనాలకు లేదా వాడకానికి ఏర్పాటు చేయలేదు. మారన్ కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల కోసం ఆ టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆయన బోట్ క్లబ్ ఇంటి నుంచి పబ్లిక్ రోడ్ల మీదుగా అన్నా సాలైలోని అరివావాలయం సన్ టీవీ కార్యాలయం వరకు 3.4 కిలోమీటర్ల మేర రహస్య కేబుల్‌ను ఏర్పాటు చేసింది. సన్ నెట్‌వర్క్ దయానిధి మారన్ సోదరుడు కళానిధిదనే విషయం అందరికీ తెలిసిందే.

మారన్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేసి విషయాలను 2007 సెప్టెంబ్ర 10వ తేదిన టెలికం కార్యదర్శికి తెలిపింది. మారన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఆ కేబుల్స్ కూడా సాధారణమైనవి కావు, అత్యంత ఖరీదైనవి. వాటిని వీడియో కాన్ఫరెన్సింగ్, భారీ డిజిటల్ డేటాతో ఆడియా వీడియో ట్రాన్స్‌మిషన్‌కు ఆ కేబుల్స్ వాడతారు. మారన్ టెలికం మంత్రి కావడంతో సన్ టీవీ వాటికి చెల్లింపులు జరపలేదు, ఉచితంగా పొందింది. ఈ లైన్ల ద్వారా చేసిన కాల్స్ విలువ దాదాపు రూ. 625.5 కోట్లు ఉంటుందని సిబిఐ అంచనా వేసింది. తనపై ఆరోపణలు చేస్తూ కథనాలను ప్రచురించిన మీడియాకు దయానిధి మారన్ నోటీసులు ఇచ్చారు.

English summary
At a time when former telecom minister A Raja is being blamed for causing a colossal loss to the national exchequer by fraudulent distribution of scare spectrum, it has emerged that his predecessor Dayanidhi Maran too looted the BSNL by taking undue advantage of his position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X