వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై వైయస్సార్ కాంగ్రెసు వ్యవస్థాపకుడు శివకుమార్ తిరుగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ‌: వైయస్ జగన్‌పై తిరుగుబాటుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ తీసుకున్న తన పార్టీని తనకు ఇప్పించాలని శివకుమార్ ఎన్నికల కమిషన్ (ఇసి)ని కలిసి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. తనకు పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన శివకుమార్ తన పార్టీని తిరిగి తీసుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అశ్రయించారని వార్తలు వస్తున్నాయి.

శివకుమార్‌కు కొన్ని హామీలు ఇచ్చి జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సొంతం చేసుకున్నారు. తనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆ మాటను జగన్ నిలబెట్టుకోలేదని శివకుమార్ అంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా అదృశ్యమైన శివకుమార్ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. శివకుమార్ తిరుగుబాటు నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం హైదరాబాదులోని తన నివాసంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. న్యాయవాదుల సలహాలను కూడా ఆయన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయనే విషయంపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు.

English summary
YSR Congress party founder Shiva Kumar revolted against YS Jagan. He wants take his party back from YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X