వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగా గురు రామ్‌దేవ్ బాబాతో చర్చలు సఫలం: ఒక్క రోజే దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramdev Baba
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతపై, అవినీతిపై నిరాహార దీక్షకు దిగాలని భావించిన యోగా గురు రామ్‌దేవ్ బాబాకు, ప్రభుత్వానికి మధ్య శుక్రవారం సాయంత్రం చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో రామ్‌దేవ్ బాబా తన దీక్షను ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేసుకున్నట్లు సమాచారం. రేపు ఒక్క రోజు రామ్ లీలా మైదానంలో విజయ దీక్షను ఆయన చేపడుతారు. ఇప్పటికే ఆయన అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఒక్క రోజు దీక్షను కొనసాగించాలని బాబా నిర్ణయించుకున్నారు.

దక్షిణ ఢిల్లీలోని క్లారిడ్జెస్ హోటల్లో బాబా రామ్‌దేవ్‌తో కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, సుబోధ్ కాంత్ సహాయ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. బాబా డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు చెబుతున్నారు. రెండు అంశాలపై తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని బాబా శుక్రవారం ఉదయమే చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. కేంద్ర మంత్రులు బాబాతో నిరంతరాయంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రామ్‌దేవ్ బాబా దీక్షకు సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా మద్దతు ప్రకటించారు.

English summary
After lengthy discussions at a five-star hotel in Delhi, Baba Ramdev has reportedly been persuaded by the government to cancel his indefinite hunger fast against corruption, scheduled to begin tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X