ప్రగల్బాలు కాదు సత్తా చూపించు: జగన్‌కు చంద్రబాబు సవాల్

అవిశ్వాసం విషయంలో సిపిఎం, సిపిఐ రెండు లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. పది రోజుల్లో తప్పకుండా అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. తెలంగాణ విషయంలో మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణపై నా మాటలు వక్రీకరించరాన్నారు. ఇలాంటివి సరికావని ఆయన మీడియాకు సూచించారు. కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్షానికి తాము హాజరయ్యే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ నిర్ణయం కేంద్రంపైనే ఆధార పడి ఉందన్నారు.
సభాపతి, ఉపసభాపతి పదవులకు తాము కూడా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. సభాపతిగా కెఇ కృష్ణమూర్తి, ఉప సభాపతిగా సుద్దాల దేవయ్యను పోటీకి దింపుతున్నట్లుగా చెప్పారు.