ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది: తానూ ఆత్మహత్య ప్రయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Khammam District
ఖమ్మం: ప్రేమోన్మాదంతో మరో యువకుడు ఓ యువతిని కత్తితో గొంతు కోసి చంపేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. యువతిని హత్య చేసిన అనంతరం యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు మాత్రం తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్, శ్రీలత పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా వారు ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో శ్రీలత, శ్రీనివాస్‌కు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన శ్రీనివాస్ శుక్రవారం నడిరోడ్డు పైనే మున్సిపాలిటీ ఈ సేవా కేంద్రం దగ్గర కత్తితో గొంతు కోశాడు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకుందామని గాజుపెంకుతో కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీలత మరిణించగా, శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ప్రేమ దాడి సంఘటనలు నెలలో ఇది రెండోది కావడం దారుణం. ఇటీవలె జిల్లా కేంద్రంలోని అనిబీసెంట్ కళాశాలలో బిఇడి చదువుతున్న ఓ యువతిని ఓ ప్రేమోన్మాది ఆమెను చున్నీతో ఉరివేసి హత్య చేశాడు.

English summary
Lover Srinivas was cutted his lover Srilatha's throat in Khammam district today. He also tried for suicide. Local people sent him to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X