హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ డైరెక్షన్ బాబు యాక్షన్: ఎమ్మెల్యే వీరశివారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆడుతున్నారని కాంగ్రెసు పార్టీ కడప జిల్లా శాసనసభ్యుడు వీరశివారెడ్డి శుక్రవారం విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను సొంతగా ఎండగట్టే శక్తి బాబుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పినట్టుగా చేస్తున్నాడని అన్నారు. ముక్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టదల్చుకుంటే బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు.

అవిశ్వాసం తర్వాత బాబు, జగన్ నవ్వుల పాలు కాక తప్పదని అన్నారు. ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలలో గెలిచిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత విజయమ్మ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో హాజరైన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, చీప్ విప్‌లకు వారిపై తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

English summary
Congress MLA Veerashiva Reddy accused that TDP president Chandrababu Naidu is going in the direction of YS Jaganmohan Reddy. He said Babu has no response on public problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X