హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకు అప్పుడే వైయస్ జగన్ రెడీ, అభ్యర్థుల ఎంపికకు సర్వేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఆయన ఇటీవలి పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నాయకులకు ఆయన సూచించిన విషయం తెలిసిందే. పార్టీ ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఇంచార్జీలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్దం కావడంలో భాగంగానే ఈ సమావేశం జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు పక్కా వ్యూహంతో పోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను గుర్తించి, వారి జయాపజయాలపై వరుస సర్వేలు నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సర్వే ఫలితాలను పోలి ఉండడంతో సర్వేలను నమ్ముకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురేసి అభ్యర్థుల్లో సర్వే ఫలితాలను, జిల్లా ఇంచార్జీలు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చే నివేదికలతో పోల్చి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆయన అనుకుంటున్నారు.

English summary
It is learnt that YSR Congress party president YS Jagan is preparing for assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X