వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై దాడుల ప్రధాన అనుమానితుడు ఇలియాస్ కాశ్మీరీ హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ilyas Kashmiri
ఇస్లామాబాద్: ఆల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాది, ముంబై దాడుల ప్రధాన అనుమానితుడు ఇలియాస్ కాశ్మీర్ అమెరికా ద్రోన్ దాడుల్లో మరణించినట్లు బిబిసి శనివారం తెలిపింది. దక్షిణ వజీరిస్తాన్‌ స్థానికుల మాటలను ఉటంకిస్తూ ఆ వార్తను బిబిసి ప్రసారం చేసింది. దక్షిణ వజీరిస్తాన్‌లోని ప్రధాన నగరం వానాకు 20 కిలోమీటర్ల దూరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ద్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ద్రోన్ ద్వారా రెండేసి క్షిపిణులను కొద్దిపాటి విరామంతో ప్రయోగించినట్లు బిబిసి ఉర్దూ చానెల్ తెలిపింది. ద్రోన్ దాడుల్లో కాశ్మీరీతో పాటు తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ద్రోన్ దాడులు జరిగిన విషయాన్ని పెషావర్ అధికార వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే, మృతుల్లో కాశ్మీరీ ఉన్నట్లు స్పష్టం చేయడం లేదు. మృతులు పంజాబీ తాలిబన్ ఉగ్రవాదులని చెబుతున్నారు.

కాశ్మీరీ పది రోజుల క్రితం ఖైబర్ గిరిజన ప్రాంతం నుంచి వానా వచ్చినట్లు తెలుపుతున్నారు. కాశ్మీరీ మృతిపై ముల్తాన్‌లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీని అడగ్గా తనకు సమాచారం లేదని సమాధానమిచ్చారు.

English summary
Al Qaeda-linked terrorist Ilyas Kashmiri, a key suspect in the Mumbai attacks, was among nine militants killed in a US drone strike, BBC reported on Saturday, quoting residents of South Waziristan tribal region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X