వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి రామ్‌దేవ్ బాబా దీక్ష భగ్నం: హరిద్వార్‌కు తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: అవినీతి, అక్రమాలు, నల్లధనాన్ని వెనక్కి రప్పించి జాతీయ సంపదగా ప్రకటించాలనే డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా దీక్షను కేంద్ర ప్రభుత్వం అమానుషంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భగ్నం చేసింది. భారీ భద్రత మధ్య రాందేవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్దరాత్రి పాశవికంగా బాబా దీక్షకు మద్దతు తెలుపుతున్న మహిళలు, యువతపై లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించి బాబాను దీక్షా శిబిరం నుండి తీసుకు పోయింది. అంతకుముందు రాందేవ్‌ను అరెస్టు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం అర్థరాత్రి రామ్‌లీలా మైదాన్‌లోని దీక్షా శిబిరానికి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. రాందేవ్‌ యోగా శిబిరానికి అనుమతి రద్దు చేసిన ఢిల్లీ పోలీసులు దీక్షా శిబిరం ప్రాంతంలో 144వ సెక్షన్‌ను విధించారు. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను బాబా అనుచరులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి టియర్‌గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అనంతరం రాందేవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వరకు వెంటబెట్టుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. దీక్షా శిబిరం కోసం వేసిన టెంట్‌ను పోలీసులు కూల్చివేశారు. కాగా బాబా దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకొని వెళ్లారు. అటునుండి ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని సప్ధర్ జంగ్ విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హరిద్వార్‌లోని ఆయన ఆశ్రమానికి తరలించినట్లుగా తెలుస్తోంది.

English summary
Baba Ramdev, whose indefinite fast was ended abruptly by Delhi Police in a mid-night swoop, today challenged the government to arrest him with a proper warrant and condemned the excesses on his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X