వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యమా: బాబా అరెస్టుపై నిరసనల వెల్లువ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువా బాబా రామ్ దేవ్ అరెస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లధనాన్ని వెనక్కి రప్పించి జాతీయ సంపదగా ప్రకటించాలనే ప్రధాన డిమాండుతో బాబా చేస్తున్న దీక్షను శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా బాష్పవాయువు, లాఠీఛార్జ్ చేసి భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అందరూ మండి పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో బాబా దీక్ష చేస్తుంటే కేంద్రం అడ్డుకోవడం విచారకరమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ విమర్శింరు. బాబా అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

బాబా అరెస్టును సిపిఐ జాతీయ నేత డి.రాజా ఖండించారు. పోలీసుల దాడిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కపిల్ సిబాల్, ప్రణబ్ ముఖర్జీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఐపిఎస్ కిరణ్ బేడీ మాట్లాడుతూ నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పోలీసుల చర్య ఖండించదగినదని మేథా పట్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా బాబా అరెస్టును ఖండించారు. బాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా రామ్ దేవ్ బాబా అరెస్టుకు నిరసనగా భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఆయన మద్దతుదారులు చేస్తున్న ధర్నాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్ పోలీసు స్టేషన్ తరలించారు.

English summary
BJP national chief Nitin Gadkari condmned Yoga Guru Baba Ramdev arrest today. He blamed congress government for attack on women as arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X