వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా రాష్ట్రంలో బాబా రామ్‌దేవ్ దీక్ష కొనసాగించవచ్చు: ఉత్తరాఖండ్ సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramesh Pokhriyal
డెహ్రాడూన్: అవినీతి, అక్రమాలకు, విదేశాలలోని నల్లడబ్బును వెనక్కి తెచ్చి జాతీయ సంపదగా ప్రకటించాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్ ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమేష్ పోక్రియాల్ రామ్ దేవ్ బాబాకు ఆదివారం మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా అవినీతిపై పోరాటం చేస్తున్న బాబా తన దీక్షను ఉత్తరాఖండ్‌లో కొనసాగించాలని నిర్ణయించుకుంటే తమ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించి పూర్తి రక్షణ కల్పిస్తుందని ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లో ఆయన దీక్షను కొనసాగించ దలిస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా పూర్తి భద్రతను ఆయనకు కల్పిస్తుందని చెప్పారు. బాబా దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. బాబా శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్నారని అందులో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుత ఆందోళనపై ప్రభుత్వం ఎందుకు దాడి చేసి కలకలం సృష్టించిందని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అవినితికి వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.

English summary
Strongly backing Baba Ramdev's "peaceful" agitation against corruption, Uttarakhand Chief Minister Ramesh Pokhriyal on Sunday assured the yoga guru of "full security" if he decides to continue his protest in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X