వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పదవి నుంచి డిఎంకె నేత దయానిది మారన్‌కు ఉద్వాసన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dayanidhi Maran
న్యూఢిల్లీ‌: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో పాత్రకు గాను డిఎంకె నేత దయానిధి మారన్‌కు కేంద్ర మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పునర్వ్యస్థీకరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ఢిల్లీకి వచ్చి దయానిధి మారన్ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసే అవకశాలున్నాయి. ఎయిర్‌సెల్- మాక్సిస్ డీల్‌లో కేసులో మారన్‌పై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

దయానిధి మారన్ రాజీనామా అడుగుతారా అని ప్రశ్నిస్తే చట్టాన్ని అమలు చేసే సంస్థలు ఆ విషయాన్ని చూసుకుంటాయని, భయాలూ పక్షపాతమూ లేకుండా పని చేసేందుకు వాటికి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన జవాబిచ్చారు. సెకండ్ జనరేషన్ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా సిబిఐ ఎయిర్‌సెల్ మాజీ చీఫ్ సి. శివశంకరన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఎయిర్‌సెల్‌లో తన వాటాను మాక్సిస్‌కు విక్రయించాలని డిఎంకె పార్లమెంటు సభ్యుడు, చేనేత మంత్రి దయానిధి మారన్ తనపై ఒత్తిడి తెచ్చాడని శివశంకరన్ ఆరోపించారు. ఎ రాజా, కనిమొళి తర్వాత 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇరుక్కున్న మూడో డిఎంకె నేత దయానిధి మారన్.

English summary
Facing the heat over his alleged role in the 2G scam, Union Textile Minister Dayanidhi Maran may be dropped in the next cabinet reshuffle, reports claimed Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X