వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌పాల్ బిల్లుపై ఆగస్టు 15 డెడ్‌లైన్, లేకుంటే ఆమరణ దీక్ష: హజారే

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ‌: లోక్‌పాల్ బిల్లును ఆగస్టు 15వ తేదీలోగా ఆమోదించాలని, లేకపోతే ఆగస్టు 16వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గాంధేయవాది అన్నా హజారే చెప్పారు. బాబా రామ్‌దేవ్ దీక్ష భగ్నానికి నిరసనగా రాజ్‌ఘాట్ వద్ద ఒక్క రోజు దీక్ష చేపట్టిన ఆయన బుధవారం మాట్లాడారు. తన ఉద్యమం రెండో స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పుకున్నారు. తన పోరాటం అహింసామార్గంలో ఉంటుందని ఆయన చెప్పారు. హింసామార్గంలోకి వెళ్లకూడదని ఆయన తన అనుచరులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజలు మాత్రమే నిర్దేశకులని, తాము కాదని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆయన విమర్శించారు. తమందరం ఒక్కటేనని, వేరు కాదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అన్నా హజారేను సమకాలీన గాంధీగా ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ అభవర్ణించారు. యుపిఎ మంత్రులకు రాజ్యాంగం గురించి తెలియదని, తమను తాము బ్రిటిష్ యుగంలోని వైస్రాయ్‌లమని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ తదుపరి పోరాటం ఎన్నికల సంస్కరణలపై, న్యాయహక్కుపై ఉంటుందని కెజ్రీవాలా చెప్పారు.

English summary
Beginning his day-long hunger strike at Rajghat to protest against corruption and the recent police brutality, the 73-year-old-Gandhi devotee Anna Hazare said that if the Lokpal Bill was not passed, he would fast unto death at Jantar Mantar from August 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X