వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌దేవ్ వెనుక ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం: చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ దీక్ష వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకోవడం ప్రస్తుతం చాలా ముఖ్యమని కేంద్ర హోంమంత్రి చిదంబరం బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. బాబా రామ్‌దేవ్ దీక్ష వెనుకు కొన్ని శక్తులు ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వారెవరో తెలుసుకోవడమే ప్రస్తుతం ప్రధానమైన అంశం అన్నారు. బాబా దీక్ష రాజకీయ కోణంలోనే జరుగుతుందని ఆయన ఆరోపించారు. బాబా దీక్ష రాజకీయ ప్రేరేపితం అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జూన్ 4వ తేదిన రాంలీలా మైదానంలో ఏం జరిగిందో పోలీసులే వివరిస్తారని అన్నారు. అయితే బాబా మాత్రం తన దీక్ష సందర్భంగా పోలీసుల సూచనలను అతిక్రమించారని అన్నారు. బాబా దీక్ష సమయంలో పోలీసులను తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు పనితీరును మీడియా తక్కువగా అంచనా వేస్తుందని ఆయన అన్నారు.

English summary
Central Minister Chidambaram suspecting that some one behind Baba Ramdev's deeksha. He said they will propose Jan Lokpal bill in next sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X