హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు భద్రత కోరుతున్న మాజీ నక్సలైట్, తెరాస నేత కోనాపురి రాములు

By Pratap
|
Google Oneindia TeluguNews

TRS Flag
హైదరాబాద్‌: మాజీ నక్సలైట్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రస్తుత నేత కోనాపురి రాములు తనకు పోలీసు రక్షణను కోరుతున్నారు. తన సోదరుడు, తెరాస నేత కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడిని హత్య చేసినవారే తనను కూడా హత్య చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాములు విజ్ఞప్తికి పోలీసులు స్పందించడం లేదు. గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని రాములుకు భద్రతను కల్పించడానికి వెనకాడుతున్నారు.

తనకు భద్రత కల్పించాలని రాములు గత నెల 24వ తేదీన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులను కోరారు. తనను చంపుతామంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ నెంబర్లను కూడా ఆయన పోలీసులకు ఇచ్చారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు భద్రత కల్పించే విషయంపై మాత్రం మాట్లాడడం లేదు. రాములుకు భద్రత కల్పించాలని తెరాస నాయకులు కూడా సీనియర్ పోలీసు అధికారులను కోరారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కోనాపురి రాములు నక్సలైట్‌గా అజ్ఞాత జీవితం గడిపారు. రెండు సార్లు పోలీసులకు లొంగిపోయారు.

English summary
Konapuri Ramulu, the Naxalite who had surrendered twice in the past and now a leader in the TRS, is desperately seeking police protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X