వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షీణిస్తున్న బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం, ఆహారం తీసుకోవాలని సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హరిద్వార్‌: నల్లధనాన్ని వెలికి తీయాలని, అవినీతికి వ్యతిరేకంగా కఠినమై చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న యోగా గురు బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన దీక్ష బుధవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ద్రవరూపంలో ఆహార పదార్థాలు తీసుకోవాలని, దీక్షను విరమించాలని ఆయనను పరీక్షించిన వైద్యులు సలహా ఇచ్చారు. రామ్‌దేవ్ ఆరోగ్యం క్షీణిస్తోందని, బరువు తగ్గారని, డీహైడ్రేషన్‌తో బాధ పడుతున్నారని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగేష్ శర్మ చెప్పారు.

పతంజలి యోగ పీఠంలో రామ్‌దేవ్ ఈ నెల 4వ తేదీ నుంచి వేలాది మంది అనుచరులతో కలిసి దీక్ష చేస్తున్నారు. తన డిమాండ్లను కేంద్రం అంగీకరించే వరకు దీక్ష కొనసాగుతుందని బాబా రామ్‌దేవ్ బుధవారం ఉదయం చెప్పారు. దీక్షలో పాల్గొనవద్దని ఆయన పిల్లలకు, వృద్ధులకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రామ్‌దేవ్ అనుచరులు ఇక్కడికి చేరుకుంటున్నారు.

English summary
Yoga guru Baba Ramdev's health has started deteriorating as his fast for tougher anti-graft laws and bringing back black money from foreign nations, entered fifth day here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X