వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోకియాని స్వాదీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్న శ్యామ్‌సంగ్

ఇక నోకియా విషయానికి వస్తే ప్రస్తుతం విండోస్ ఫోన్ డివైజెస్ మీద వర్కింగ్ చేస్తుంది. విండోస్ ఫోన్ డివైజెస్‌ని 2011 నాల్గవ క్వార్టర్‌లో విడుదల చేయాడనికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కాలంలో నోకియా స్టీమ్ లైన్ ఆపరేషన్స్‌కి సంబంధించిన 7,000మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ శ్యామ్‌సంగ్ గనుక నోకియాని స్వాదీనం చేసుకుంటే గ్యారంటీగా ప్రపంచంలో విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌లో ముందుకు దూసుకుపోగలదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
నోకియాని శ్యామ్ సంగ్ టేక్ ఓవర్ చేస్తున్న విషయాన్ని శ్యామ్ సంగ్ అధికారుల వద్ద ప్రస్తావించగా దీనిపై వారు మాట్లాడడానికి నిరాకరించారు.