• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

14 ఏళ్ల విద్యార్థిని గ్యాంగ్ రేప్: స్నేహితుడే ప్రధాన నిందితుడు

By Srinivas
|

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో శుక్రవారం పద్నాలుగేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. మల్కాజ్‌గిరికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. గ్యాంగ్ రేపుకు గురైన విద్యార్థిని చదువుతున్న పాఠశాలలోనే చదువుతున్న ఓ స్నేహితుడు ఆమెకు ఫోన్ చేసి మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ వద్దకు రమ్మన్నారు.

అక్కడకు వచ్చిన అనంతరం అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలైన అమ్మాయి తన తల్లికి చెప్పింది. అమ్మాయిని తీసుకొని వెళ్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుండి నేరుగా ఆమెను మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా అమ్మాయిపై అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.

English summary
Ninth class student gang raped by his friends today at Malkajgiri railway station of Hyderabad. Police arrested accused students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X