వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో కనిమొళి బెయిల్ పిటిషన్, జైలు నుంచి విముక్తికి తంటాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: తీహార్ జైలు నుంచి విముక్తి కోసం డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి తంటాలు పడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆమె శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. కళైంగర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో వారిద్దరిని సిబిఐ సహ నిందితులుగా చేర్చింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వారిద్దరు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ, ధన ప్రాబల్యం కారణంగా కనిమొళి, శరద్ కుమార్ సాక్ష్యాలను తారుమారు చేయగలరని, సాక్షులను ప్రభావితం చేయగలరని భావించి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

English summary
Following the rejection of her bail plea by the Delhi High Court, DMK's Kanimozhi moved the Supreme Court, Friday, seeking bail in 2G scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X