హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

19న హైదరాబాదులో కెసిఆర్ కుటుంబ సభ్యుల వంటా వార్పూ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్ణయించింది. తెరాస కార్యవర్గ సమావేశం శుక్రవారం పలు నిర్ణయాలు తీసుకుంది. తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్, పార్టీ నాయకుడు నాయని నర్సింహా రెడ్డి కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాదులో వంటావార్పూ జరుగుతుందని, ఆ రోజు హైదరాబాదులో ఒక్క వాహనం కూడా తిరగకుండా చేస్తామని ఈటెల రాజేందర్ చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోని జూబిలీహిల్స్‌లో గల క్యాన్సర్ ఆస్పత్రి వద్ద వంటా వార్పూ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.

వంటా వార్పూ కార్యక్రమానికి ముందుస్తు తయారీగా ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో భారీ ప్రచార బహిరంగ సభ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సభలో తెలంగాణ జెఎసి నాయకులతో పాటు దానిలో భాగస్వాములుగా పార్టీల నాయకులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇంటింటికీ తమ పార్టీ మహిళా కార్యకర్తలు వెళ్లి వంటా వార్పూను విజయవంతం చేయాలని కోరుతారని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల దిగ్బంధం కూడా చేస్తామని, సీమాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా రైల్ రోకో కార్యక్రమం కూడా చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగే విధంగా సకల జనుల సత్యాగ్రహ కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన చెప్పారు.

రంగారెడ్డి జిల్లా తాండూరులో తెలుగుదేశం తెలంగాణ ఫోరం నిర్వహించిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభ పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని నాయని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, తెలుగుదేశం తెలంగాణ ఫోరం రణభేరీ బహిరంగ సభలు వారి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని, అందుకే వాటిని అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు.

English summary
TRS president KCR will participate in Vanta - Varpu programme on June 19 in Hyderabad with his family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X