వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్ ఆస్తులు రూ. 1,100 కోట్లు, వెల్లడించిన బాలకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హరిద్వార్‌: బాబా రాందేవ్‌ నెలకొల్పిన నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్లపైనే ఉంది. వీటిలో దివ్యయోగ మందిర్‌ ట్రస్టు రూ.249.63 కోట్లు, పతంజలి యోగపీఠ్‌ ట్రస్టు రూ.164.80 కోట్లు, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రూ.9.97 కోట్లు, ఆచార్యకుల్‌శిక్ష సంస్థాన్‌ రూ.1.79 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అయిన వ్యయం రూ.751.02 కోట్లు. బాబా సహాయకుడు బాలకృష్ణ గురువారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

'మేము పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకతను పాటిస్తాం. ఆదాయం ఎంత? ఖర్చు ఎంత అయింది? ఎలా అయింది? వంటి వివరాలన్నీ కచ్చితంగా నమోదు చేస్తాం' అని ఆయన తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము పన్ను కడతామని, తమ అనుబంధ సంస్థల వివరాలను కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు. పన్ను వివరాలు, ట్రస్టుల బ్యాలెన్స్‌ షీట్లను తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశామన్నారు. బాబారాందేవ్‌ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు.

11 వేలమందితో సాయుధదళాన్ని ఏర్పాటుచేస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో రాందేవ్‌ గురువారం వివరణ ఇచ్చారు. 'నేను నక్సలైట్లనో, మావోయిస్టులనో, ఉగ్రవాదులనో తయారు చేయటం లేదు. ఆత్మరక్షణ కోసం జాతీయభావాలున్న ఒక దళాన్ని మాత్రమే రూపొందిసాల్త'నని చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బాబా దీక్ష శుక్రవారానికి ఏడో రోజుకు చేరుకుంది. 'లక్ష్యాన్ని సాధించేవరకూ దీక్ష కొనసాగిస్తా. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు' అని రాందేవ్‌ స్పష్టం చేశారు.

English summary
Yoga guru Ramdev, who is on an indefinite hunger strike against black money and corruption, today made public details of his business empire worth over Rs 1,100 crore, claiming everything was in order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X