వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా దీక్షలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
పాట్నా: నల్లధనం వెలికితీయాలన్న డిమాండ్‌తో నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు రామ్‌దేవ్‌కు సంఘీభావంగా బీహార్‌లో ఆయన మద్దతుదారులు దీక్ష కొనసాగిస్తున్నారు. పాట్నాలోని కార్గిల్ చౌక్ వద్ద చేపట్టిన దీక్షలో 80 మంది పాల్గొంటున్నారని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్(బీహార్ విభాగం)కన్వీనర్ అజిత్ కుమార్ తెలిపారు. ముజాఫర్‌నగర్, సీతామార్హి, మోతిహరి, దర్బంగాలోనూ రామ్‌దేవ్‌కు మద్దతుగా దీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు.

గత ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యోగాగురు బాబా రామ్‌దేవ్(46) ఆరోగ్యం క్షీణించింది. ఆయన అపస్మారక స్థితికి వెళ్లారని రామ్‌దేవ్ సన్నిహిత అనుచరుడు స్వామి సంపూర్ణానంద వెల్లడించారు. రామ్‌దేవ్‌ను శుక్రవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆదేశాల మేరకు డెహ్రాడూన్‌లోని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు తరలించారు. బాబా కీలక అవయవాల పనితీరు ఆందోళనకరంగా ఉందని, మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమైందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఆయనకు గ్లూకోజ్ అందిస్తున్నట్లు, ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్లు జోలీ గ్రాంట్, డాక్టర్ ఎస్‌ఎల్ జెతానీ చెప్పారు.

English summary
The health condition of yoga guru Ramdev, who was admitted to a hospital here on Friday, is improving and he is being treated in a VIP ward, doctors attending on him said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X