• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొండా సురేఖ సాక్షిగా తెలంగాణ విద్యార్థులపై జగన్ కార్యకర్తల దాడి

By Srinivas
|

YS Jagan
వరంగల్: రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త సాగుపోరు నిర్వహిస్తోన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అడ్డుకోవడంతో వరంగల్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగుపోరు కార్యక్రమంలో భాగంగా సోమవారం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఎలాంటి అధికారిక పర్యటనలు చేయవద్దని కెయు జెఏసి హెచ్చరించింది. వరంగల్‌లో వైయస్ఆర్ కాంగ్రెసు నిర్వహించే సాగుపోరును అడ్డుకుంటామని హెచ్చరించింది.

చెప్పినట్టుగానే కెయు విద్యార్థులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండాలు తొలగించారు. ఫ్లెక్సీలు చించి వేశారు. ధర్నాను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. జగన్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి విద్యార్థులపై దాడి చేశారు. పలువురు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.

English summary
YSR Congress party president activists attacked on the Kakatiya University students at the time of obstructing their Saguporu programme in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X