హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిందే, మా వైఖరి అదే: ప్రకాష్ కారత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Karat
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ప్రభుత్వమేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందనీ, శ్రీకృష్ణ కమిటీని వేస్తే అదీ నివేదిక సమర్పించిందనీ, ఇక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్రానిదే అని తేల్చి చెప్పారు. ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోకుండా ఉండడం మంచిది కాదన్నారు. తెలంగాణకు సంబంధించి తమ పార్టీ వైఖరిలో మార్పేమీ లేదన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారమిక్కడ ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

బెంగాల్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల నాటినుంచీ సీపీఎంపై తీవ్రమైన దాడి జరిగిందన్నారు. వామపక్షాలు, మావోయిస్టులతో సహా అంతా ఒక్కటయ్యారని, ఇది తమ పార్టీపై ప్రభావాన్ని చూపిందన్నారు. మరోవైపు వీరంతా కలిసి చేసిన మార్పు నినాదం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. 34 ఏళ్లనుంచీ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, ప్రజలు మార్పు నినాదానికే ఓటేశారన్నారు. కొన్ని వర్గాల ప్రజల్లో వామపక్షాలు ఆదరణ కోల్పోయాయన్నారు. సింగూరు, నందిగ్రాం అంశాలతో తమ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పారు. భూమిని సేకరించాలన్న ఆలోచనే తమ పార్టీకి ప్రతికూలంగా మారిందన్నారు. రాజకీయ, సంస్థాగత అంశాల్లో ఉన్న లోపాలను సరి చేసుకునే కార్యచరణను చేపడతామన్నారు.

సీపీఎంలో ఎన్నికల ఫలితాలపై ఆధారపడి నాయకత్వ మార్పు ఉండదన్నారు. బెంగాల్‌లో ఇప్పుడు కనీస ప్రజాస్వామ్య హక్కులు లేవనీ, దీనిపై జులై ఒకటోతేదీనుంచి ఏడో తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారం చేస్తామన్నారు. వీరిలో ఎక్కువమందిని మావోయిస్టులే హత్య చేశారన్నారు. కేరళలో పార్టీ బాగా పనిచేసిందని, కానీ మలప్పురం లాంటి ప్రాంతాల్లో ముస్లింలీగ్‌ వ్యతిరేకంగా పనిచేయడం, నియోజకవర్గాల పునర్విభజనతోను కేవలం మూడుస్థానాల మెజార్టీతో తమ ప్రత్యర్థి యూడీఎఫ్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

English summary
CPM general secretary Prakash Karat demanded centre to solve Telangana issue as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X