వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స సత్యనారాయణకు తొలి షాక్, తీవ్ర వ్యాఖ్యలతో హర్షకుమార్ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

GV Harshakumar
న్యూఢిల్లీ: పిసిసి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలకు స్వీకరించిన బొత్స సత్యనారాయణకు తొలి షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు జి.వి.హర్షకుమార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించారు. అత్యంత అవినీతిపరుడైన బొత్సను పీసీసీ అధ్యక్షుణ్ని చేయడం పార్టీకి ఏమాత్రం మేలుచేయదంటూ లేఖలో రాశారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా 6వ తేదీ నియమితులైతే హర్షకుమార్‌ 7న రెండు పేజీల లేఖ రాశారు.

బొత్స రాజకీయ జీవింతమంతా వివాదాస్పదమేనని, తప్పుడు దారుల్లో భారీగా డబ్బు గడించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు మద్యం సిండికేట్‌తో కుమ్మక్కయ్యారుని, కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, సీబీఐ నిష్కళంకుడని చెప్పినా వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణంలో బొత్స చేయి ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లాలో భూకబ్జాకోరులుగా పేరుందని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నా నియోజకవర్గంలో కాపులు మొత్తం అటువైపు వెళ్లిపోయినా దళితులు కాంగ్రెస్‌కు పూర్తి అండగా నిలిచారని, ఫలితంగా ముక్కోణపు పోటీలో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.

కోస్తా జిల్లాల్లో సాధారణంగా కాపులు-దళితులకు మధ్య సత్సంబంధాలు లేవని, బొత్స మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని,బొత్స సత్యనారాయణ కేవీపీ మద్దతుదారుడు కూడా అని, కాపు, తూర్పుకాపు, మున్నూరు కాపులంతా ఒక్కటేనని, పీసీసీ అధ్యక్షస్థానం ఎప్పుడూ వీరికే ఇస్తూ పోతే కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటుబ్యాంక్‌ అయిన దళితులు జగన్‌వైపు వెళ్లే ప్రమాదముందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే మంచిదని ఆయన అన్నారు.

English summary
Congress Amalapuram MP Harshakumar has opposed Botsa Satyanarayana's appointment as PCC president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X