వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై గాంధీజీ రూపం, గుర్తించామన్న ఇటలీ అంతరిక్ష సంస్థ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mahatma Gandhi
లండన్‌: అంగారక గ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ఇటలీ అంతరిక్ష సంస్థ ఒకటి ప్రకటించింది. 'ఐరోపా మార్స్‌ ఆర్బిటర్‌' ఇటీవల భూమికి పంపిన చిత్రాల్లో ఈ రూపం స్పష్టంగా కనిపించినట్లు 'మట్టేవో లన్నెవో' సంస్థ తెలిపింది. ఆంగారకుడిపై మనిషి ఆకారాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 1976, జులైలో అమెరికాకు చెందిన వికింగ్‌-1 ఆర్బిటర్‌ తీసిన చిత్రాల్లోనే ఇది వెలుగు చూసింది.

ధూళితో నిండిన అంగారకుడి ఉపరితలంపై ఓ శిల మనిషి ఆకారంలో ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 'హై రైజ్‌' కెమెరా కూడా మానవ రూపాన్ని చిత్రీకరించింది. ఇది ఓ పెద్దశిలఅని స్పష్టం చేసింది.

English summary
An Italian space buff has claimed to have spotted the face of Mahatma Gandhi [ Images ] etched into the rocks of Mars [ Images ] while scanning through latest pictures of the Red Planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X