వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎంకె పొత్తుపై చర్చించలేదు: ప్రధానితో భేటీ అనంతరం సిఎం జయలలిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha
న్యూఢిల్లీ: కరుణానిధి ఆధ్వర్యంలోని డిఎంకె పార్టీతో కాంగ్రెసు పార్టీ సంబంధాలపై తమ చర్చలో ప్రస్తావన రాలేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆమె చెప్పారు. ఆందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు.

ఇటీవల కుంభకోణంలో ఇరుక్కు పోయిన కేంద్రమంత్రి దయానిధి మారన్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కోరినట్లు చెప్పారు. డిఎంకె పొత్తుపై చర్చ రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పలార్ డ్యామ్ పనులు నిలిపి వేయించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని ఆమె కోరారు. కాగా అంతకుముందు ఆమెకు ప్రధాని మన్మోహన్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రధాని దగ్గరకు ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆమె వెళ్లారు. తనిఖీలు లేకుండా నేరుగా ఆమె ప్రధాని వద్దకు చేరుకోవడం విశేషం.

English summary
Tamilnadu chief minister Jayalalitha said today that she did not talk about DMK and Congress party friendship in Prime Minister Manmohan Singh meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X