వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్‌లో జగన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్‌కు ర్యాలీ, విద్యార్థులపై లాఠీఛార్జ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులపై వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల దాడికి నిరసనగా మంగళవారం వరంగల్ జిల్లాలో తెలంగాణవాదులు చేసిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొండా సురేఖ కార్యకర్తల దాడికి నిరసనగా వరంగల్‌లోని అమరవీరుల స్థూపం నుండి పలువురు తెలంగాణవాదులు, న్యాయవాదులు, విద్యార్థులు, జర్నలిస్టులు కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలు దేరారు. అనుమతులు లేకుండా కలెక్టరేట్ వద్దకు ర్యాలీలు, ఆందోళనలు అనుమతించరు.

ఈ కారణంగా వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. దీంతో తప్పని పరిస్థితిలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జిలో ముగ్గురు విద్యార్థులకు, ఒక జర్నలిస్టుకు తీవ్రగాయాలయ్యాయి.

English summary
Tension take place in Warangal district today. Telanganites organiged rally against YS Jaganmohan Reddy and Konda Surekha followers attack on Kakatiya University students on yesterday. Police obstruct rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X