వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోకియా, ఆపిల్ భాయ్ భాయ్: పరిష్కారం కుదిరిన పేటెంట్ దావాలు

నోకియా ప్రెసిడెంట్, సిఇఒ స్టీఫెన్ ఎలోప్ మాట్లాడుతూ, ఆపిల్ చేరికతో నోకియా లైసెన్సీల సంఖ్య వృద్ధి చెందినందుకు తాము చాలా ఆనందంగా ఉన్నామని అన్నారు. ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. కానీ ఆపిల్ నోకియాకు ఒకసారి చెల్లింపు, అలాగే ఒప్పందం ప్రకారం రాయల్టి చెల్లిస్తుంది. ఈ ఒప్పందం నోకియా వచ్చే ఆర్థిక ఫలితాలపై సానుకూల ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. 2009 అక్టోబర్ నుంచి రెండు మొబైల్ కంపెనీల మధ్య వ్యాజ్యాల వివాదం కొనసాగుతోంది.
10 పేటెంట్లకు సంబంధించి ఆపిల్‌ను విమర్శిస్తూ నోకియా దావా దాఖలు చేయగా, ఐఫోన్‌కు సంబంధించి 13 ఆపిల్ పేటెంట్లపై నోకియాపై ఆరోపణలు చేస్తూ 2009 డిసెంబర్‌లో ఆపిల్ ప్రతిగా దావాను దాఖలు చేసింది. 2011 మార్చిలో నోకియా ఆపిల్‌పై అమెరికా వాణిజ్య సంఘానికి ఫిర్యాదు చేసింది.