వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా యూనివర్శిటికే మచ్చ తెస్తున్న ప్రోఫెసర్ లైంగిక వేధింపులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Balla Apparao
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు అప్పారావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెండుసార్లు నివేదికలువచ్చినా ఆయనపై చర్యలు తీసుకొనేందుకు విశ్వవిద్యాలయ పాలకమండలి భయపడుతోంది. అప్పారావు లైంగిక వేధింపులకు అలవాటుపడ్డారని భావిస్తున్న గవర్నర్‌ కార్యాలయం అతనిపై చర్య తీసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. కొద్దిరోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆచార్య అప్పారావు గత ఏడాది తన దగ్గర అధ్యయనం చేస్తున్న 49 ఏళ్ల పీహెచ్‌డీ పరిశోధకురాల్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆమె కొద్ది రోజులపాటు ఓపిక వహించి చివరికి ఆచార్యుడి ప్రేలాపనలను సెల్‌ఫోన్‌ రికార్డుచేసి సాక్ష్యాలతో వైస్‌ ఛాన్స్‌లర్‌ ముందుంచారు. సంభాషణల సీడీ జతచేసి మరోకాపీని ఏకంగా గవర్నర్‌కు(2010 అక్టోబరు 25) పంపారు. గవర్నర్‌ వెంటనే స్పందించారు.

దాంతో పోయిన నెలలో ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశమైంది. ఆరోపణలపై అప్పారావు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. నిజానికి అది తీవ్రమైన చర్య ఏమీకాదు. ఉన్నత విద్యాశాఖ సూచన మేరకు తీసుకున్న నిర్ణయం అది. నోటీసులు జారీ చేసేందుకు కూడా విశ్వవిద్యాలయం సాహసించడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు వైస్‌ ఛాన్స్‌లర్‌ కోసం ప్రయత్నం చేయగా మాట్లాడేందుకు నిరాకరించారు. రిజిస్ట్రార్‌ ఫోనే ఎత్తలేదు. పాలకమండలి సభ్యులపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమని తెలుస్తోంది.

అప్పారావు గతంలో మరో పరిశోధకురాల్ని ఇలాగే వేధించారు. వేధింపులకు తాళలేక ఆమె తన పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ 1996లో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ ఆదేశంమేరకు జస్టిస్‌ జి.రాధాకృష్ణ కమిటీ వేశారు. విచారణ చెల్లదంటూ అప్పారావు కోర్టును ఆశ్రయించడంతో విచారణ ఆగిపోయింది. అతని పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం జస్టిస్‌ హనుమంతు కమిటీతో విచారణ పూర్తి చేయించింది. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం ఉందని కమిటీ ధ్రువీకరించింది. నివేదిక ఆధారంగా 2001 మార్చి 3న పాలకమండలి కీలక తీర్మానాలు చేసింది. 1) అప్పారావు స్థాయిని ఆచార్యుడి నుంచి సహ ఆచార్యుడికి తగ్గించడం. 2) షోకాజ్‌ నోటీసు జారీ చేయడం. 3) పాలన బాధ్యతల పోస్టులకు దూరంగా ఉంచడం. వివిధ కారణాలతో నాటి తీర్మానాలను అమలు చేయలేదు.

English summary
balla apparao is doing sexual harassment to students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X