• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెరుచుకున్న యజుర్వేద మందిరం: మీడియాకు, పోలీసులకు నో ఎంట్రీ

By Srinivas
|

Sathya Sai Baba
అనంతపురం: గత కొంతకాలంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉండిన యజుర్వేద మందిరం తెరుచే విషయంలో సందిగ్ధం తొలగి పోయింది. ఎట్టకేలకు గురువారం ఉదయం ట్రస్టు సభ్యులు బాబా నివసించిన యజుర్వేద మందిరాన్ని తెరిచారు. మంగళవారమే ట్రస్టు సభ్యులు సమావేశం అయి గురువారం మందిరాన్ని తెరుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే యజుర్వేద మందిరాన్ని తెరిచిన ట్రస్టు సభ్యులు లోపలకు పోలీసులను, రెవెన్యూ అధికారులను, మీడియాను ఎవరినీ అనుమతించలేదు.

ట్రస్టు సభ్యులు అయిన ఎస్వీ గిరి, చక్రవర్తి, రత్నాకర్, శ్రీనివాసన్‌తో పాటు సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ మాత్రమే లోనికి వెళ్లారు. యజుర్వేద మందిరంలో ఏం ఏం ఉన్నాయో వారు చూస్తున్నారు. అయితే పోలీసులను, మీడియాను ఎవరినీ అనుమతించక పోవడం అనుమానాలకు దారి తీస్తోంది. యజుర్వేద మందిరాన్ని సభ్యులు పరిశీలించిన అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం ఉంది. కాగా ట్రస్టుకు సంబంధించిన అన్ని ఆస్తులు యజుర్వేద మందిరంలోనే ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Sathya Sai Trust members opened Yajur Mandir on thursday. Members were not accept to media and police in mandir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X