గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుపేదలపై ఔషద ప్రయోగాలపై విచారణ: డిఎల్ రవీంద్రారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
గుంటూరు: పిడుగురాళ్లలో పేదలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ఔషధ సంస్థలు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటామని ప్రాథమిక, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఔషధ సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాదులోని పలు ఔషధ కంపెనీలు నిరుపేదలపై క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. బాధితుల ప్రాణాలు ముప్పు లేదని డిఎల్ చెప్పారు. పిడుగురాళ్లలోని పలు కాలనీలలోని సుమారు 40 మందిపై ప్రయోగాలు చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ వ్యర్థాలపై అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయో మెడికల్‌ వ్యర్థాలను సమగ్రంగా డిస్పోజ్‌ చేసేందుకు జపాన్‌ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక టెండర్లు పిలిచినా ఇందులో అవకతవకలు చోటుచేసుకున్నాయని దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని మంత్రి చెప్పారు. ఔషధ ప్రయోగాలపై కొన్ని చట్టాలున్నా అవి పకడ్బందీగా అమలు కావడం లేదని చెప్పారు

కాగా నిరుపేదలపై ఔషధ ప్రయోగాలకు నిరసనగా పిడుగురాళ్లలో సిపిఐ ర్యాలీ నిర్వహించింది. జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను మనుషులపై చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని సిపిఐ నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కోరారు.

English summary
Health minister DL Ravindra Reddy said that government will made enquiry committee on clinical trails. He said government will not leave any accuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X