అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి వారసుడు సత్యజిత్: మందిరంలో బయటపడ్డ బాబా వీలునామా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నివసించిన యజుర్వేద మందిరంలో సత్యసాయి ట్రస్టు కీలక డాక్యుమెంట్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. ఇందులో సత్యసాయి వీలునామా దొరికినట్లుగా తెలుస్తోంది. సత్యసాయి వీలునామా దొరికిందని పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సత్యసాయి రాసిన వీలునామా ప్రకారం సాయి వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌కు కీలక పదవి అప్పగించేందుకు ట్రస్టు సభ్యులు నిర్ణయం తీసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. సత్యజిత్‌ను తన వారసుడిగా బాబా తన వీలునామాలో రాసినట్లుగా పుకార్లు వస్తున్నాయి. సత్యసాయి యజుర్ మందిరంలో భారీగా ఆస్తులు బయట పడ్డట్టు తెలుస్తోంది. మందిరాన్ని గురువారం ఉదయం తెరిచిన విషయం తెలిసిందే. అందులోని డబ్బును, బంగారాన్ని రెండు రోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు.

కాగా ట్రస్టు ఆస్తులు లెక్కిస్తున్నారని శుక్రవారం ట్రస్టు సభ్యుడు నాగానంద్ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికి 75 శాతం లెక్కింపు పూర్తయిందని సాయంత్రం పూర్తి అయ్యాక బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని చెప్పారు. కాగా మందిరాన్ని తెరిచే సమయంలో సత్యజిత్‌ రావడానికి కారణం వీలునామా ఆయన పేరనే ఉండటమని తెలుస్తోంది. మందిరంలో వందల కొద్ది బంగారం, డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని చూసి లెక్కించే వారు ఆశ్చర్య పోయినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, the will was revealed that Bhagvan Sri Sathya Sai Baba legacy is Satyajit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X