వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి-కాంగ్రెసుకు షాక్: తెలంగాణ ప్రాంతీయ బోర్డు కేంద్రం యత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు అధిష్టానం నుండి మరొసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రత్యేక తెలంగాణపై అధిష్టానం నుండి హామీ తీసుకొని వస్తామని వెళ్లి టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కాంగ్రెసు అధిష్టానం నుండి ఎలాంటి హామీ లభించలేదు. అంతేకాదు తెలంగాణ ఇవ్వడం కాకుండా తెలంగాణ కోసం ప్రత్యేక ప్రాంతీయ బోర్డు వేయడానికి కేంద్రం నిర్ణయించుకుందనే విషయం తెలిసిన టి-కాంగ్రెసు నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో కష్టమని భావించిన అధిష్టానం పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్ తరహా తెలంగాణ కోసం ప్రత్యేక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో షాక్‌కు గురైన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానానికి మరో 15 రోజులు గడువు ఇచ్చాం కాబట్టి ఆ తర్వాతే రాజీనామాలకు పూనుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ చివరకు ఈ నెలాఖరు వరకు ఆగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు చిదంబరం, ప్రణబ్‌లను కలిసిన తెలంగాణ మంత్రులకు ఏవిధమైన హామీ రాలేదు. శుక్రవారం ఆంటోని నుండి కూడా ఎలాంటి హామీ రాక పోవడం వారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అయితే సాయంత్రం కోర్ కమిటీ సమావేశం ఉన్నందున ఆంటోనితో వారు తమ బాధను వెల్లబోసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
High Command give shock to T-congress leaders that centre is ready to seperate regional board for Telangana development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X