వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వ్యతిరేకుల బాధ్యత బొత్సదే: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వారి బాధ్యతను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీసుకోవాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వ్యతిరేకులను బొత్స అదుపులో పెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ల పైనే వంటా వార్పుకు తాము వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. అయితే మద్దతు ఇచ్చే ప్రసక్తి మాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రాంత నేతల మధ్య కొందరు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Ex minister Ramreddy Damodar Reddy said that PCC president Botsa Satyanarayana must take responsibility on opposers in Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X