అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.10 కోట్లతో పట్టుబడ్డ ట్రస్టు సభ్యుడి డ్రైవర్: సంబంధం లేదన్న ట్రస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Police found Sathyasai
అనంతపురం: కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుబడిన డబ్బులతో సత్యసాయి ట్రస్టుకి ఎలాంటి సంబంధం లేదని ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌ ఆదివారం చెప్పారు. నగదు పట్టివేత వ్యవహారంపై సాయంత్రం ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోపక్క జిల్లాలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. కొత్తచెరువు మండలం లోచర్ల వద్ద కర్నాటక ఆర్టీసీ బస్సుని స్పెషల్‌ పార్టీ పోలీసులు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అనుమానస్పదంగా ఆ వ్యక్తి బెంగుళూరుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అతని పేరు శేఖర్‌గా తెలుస్తోంది. అతను సత్యసాయి ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ కారు డ్రైవర్. శేఖర్ వద్ద 10 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అయితే శనివారం రాత్రి హరీశ్వర్ శెట్టి, ఆదివారం శేఖర్ డబ్బులు పట్టుకొని పోతూ పట్టుబడటం పట్ల ఇటు భక్తులలో, అటు పోలీసులలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అసలు ట్రస్టులో ఉన్న డబ్బెంత పోయిన డబ్బెంత అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా డబ్బు ఏమైనా పోయిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

English summary
The rumors were came that the police found 10 crore rupees of Sathya Sai Trust amount at Locharla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X