పెళ్లి కూతురు ఆలస్యంగా వచ్చిందని.... కొట్టుకున్న ఇరువర్గాలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
తిరుపతి/మెదక్: పెళ్లి కూతురు ఆలస్యంగా రావడంతో ఓచోట, పెళ్లి కొడుకు కట్నంతో పారిపోవడంతో మరోచోట రెండు పెళ్లిల్లు ఆదివారం ఆగిపోయాయి. ఈ సంఘటనలు చిత్తూరు, మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. చిత్తురూ జిల్లా తిరుపతి సమీపంలో ఉమా మహేశ్వరి, సుబ్బారావు అనే ఇద్దరి పెళ్లి ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కూతురు అయిన ఉమా మహేశ్వరితో పాటు ఆమె బంధువులు ముహుర్తానికన్నా మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో పెళ్లి కొడుకు సుబ్బారావు తరపు బంధువులు పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పారు.
దీంతో ఇరువర్గాల మధ్య కాస్త గొడవ ముదిరింది. ఇది కాస్త ఇరువర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. పెళ్లి కూతురు తరఫు బంధువులు, పెళ్లి కొడుకు తరఫు బంధువులు కర్రలు తదితరాలతో కొట్టుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక రుయా హాస్పిటల్ తరలించారు. కాగా మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో అబ్బాయి పెళ్లికి కొద్ది సమయం ముందు కట్నంతో పారిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి