వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామ కోర్కిక తీర్చలేదని ఓ బాలిక కన్ను పోడిచిన దుండగులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
కోరిక తీర్చలేదని కామాంధులిద్దరు ఓ బాలిక కన్నుపొడిచారు. ఈ ఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ నెల 10న లఖీంపూర్‌లో 14 ఏళ్ల బాలిక అత్యాచారం ఆపై హతమైన ఘటన మరవక ముందే ఈ దారుణం వెలుగుచూడడంతో మాయావతి సర్కారుపై కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. ''శనివారం పని నిమిత్తం గడ్వా బుజుర్గ్‌ వెళ్లిన దళిత బాలిక(14)ను అదే గ్రామానికి చెందిన కులదీప్‌(18), నిరంజన్‌యాదవ్‌(17) అత్యాచారం చేయడానికి యత్నించారు. బాలిక ప్రతిఘటించడంతో కత్తులు చూపి బెదిరించారు. అప్పటికీ లొంగకపోవడంతో బాలిక ఎడమ కంటిలో కత్తితో పొడిచారు. కుడి కంటిని కూడా గాయపర్చారు. చికిత్స నిమిత్తం బాలికను కన్నౌజ్‌ ఆసుపత్రికి తరలించాం. నిరంజన్‌ యాదవ్‌ను అరెస్టు చేశాం'' అని ఎస్పీ రాజేంద్ర సింగ్‌ తెలిపారు.

బాలిక ఎడమ కన్నుకి పూర్తిగా గాయమవగా, కుడి కన్నుకి 80శాతం పైగా గాయమైంది. కార్నియా దెబ్బతింటే గతంలో మాదిరి చూడడం కష్టమేనని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నిందితులు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) యువజన విభాగానికి చెందిన వారని లక్నో డివిజనల్‌ కమిషనర్‌, సెక్రటరీ (సమాచారం) ప్రశాంత్‌ త్రివేది తెలిపారు. ''బాధితురాలు వాంగ్మూలం ఇవ్వాలని ప్రయత్నించినా పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. నిందితులిద్దరూ బాలికను తరచూ వేధించేవారు. ఈ సారి ఆమె జీవితానికే ముప్పుతెచ్చారు. వారిని కఠినంగా శిక్షించాలి. వారికి చేసిన తప్పేంటో తెలియాలి. కనీసం ఐదేళ్లు శిక్షించినా మాకు సమ్మతమే'' అని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

కేసుకు సంబంధించి ఎస్సై శివశంకర్‌, కానిస్టేబుల్‌ హక్రుద్దీన్‌లను సస్పెండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించింది.

English summary
Kuldeep (18) and Niranjan Yadav (17) attempted to rape the 14-year-old girl when she had gone out in connection with some work in Gadwa Buzurg village in Gursahaiganj area in Kannauj last evening, officials said, adding Niranjan has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X