వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులోనూ కనిమొళికి చుక్కెదురు, మరింత జైలులోనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు, డిఎంకె నేత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కలైంగర్ టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ నిరాకరణతో కనిమొళి మరింత కాలం తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు కనిమొళికి సూచించింది. కొంత మేరకు ఆమెకు ఇది ఊరట.

సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో కనిమొళికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సిబిఐ ప్రత్యేక కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే కారణంతో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ కనిమొళిని మే 20వ తేదీన అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంటున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో పాటు కనిమొళిని సహ కుట్రదారుగా చేర్చింది.

English summary
Kanimozhi will stay in Tihar Jail. The Supreme Court today refused to grant bail to the young MP who was arrested on May 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X