‘యాహూ’ నుంచి డైరెక్ట్ సెర్చ్, సమాచార సేకరణ మరింత సులభం
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
ఇంటర్నెట్లో కోరిన సమాచారాన్ని అన్వేషించి, మనకు అందించే సెర్చ్ ఇంజిన్‌కు యాహూ మరిన్ని మెరుగులు దిద్దుతోంది. కోరిన సమాచారానికి సంబంధించిన వెబ్సైట్ లింక్‌లు కాకుండా, నేరుగా సమాచారాన్ని అందించే సెర్చ్ డైరెక్ట్‌ను రూపొందిస్తోంది. అమెరికా, మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని భారత్‌లో ఈ ఏడాది ఆఖరుకు ప్రవేశ పెడతామని యాహూ ఉపాధ్యక్షుడు (ఇంజినీరింగ్, సెర్చ్, మార్కెట్ ప్లేసెస్ గ్రూప్) అమిత్ దయాళ్ బుధవారం ఇక్కడ చెప్పారు. కంప్యూటర్లతో పాటు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి విభిన్న పరికరాలపై నెట్ బ్రౌజ్ చేసే వారికి అనువుగా సెర్చ్ డైరెక్ట్‌ను తీర్చిదిద్దాలనేది తమ ప్రణాళికగా ఆయన చెప్పారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. దేశీయంగా అవసరమైన సమాచారం కోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. అమెరికాలో సెర్చ్ డైరెక్ట్ ప్రారంభించాక ఏప్రిల్‌లో యాహూకు ఆదరణ 17.9 నుంచి 19.6 శాతానికి చేరిందని అమిత్ తెలిపారు.
ఇందులో భాగంగానే పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. బెంగళూరులోని యాహూ పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ప్రస్తుతం 2 వేల మంది నిపుణులున్నారని, సెర్చ్ఇంజిన్ టూల్స్ అభివృద్ధిలో వీరి పాత్ర గణనీయమని అమిత్ వివరించారు. ఈ ఏడాది కనీసం 200 మందిని కొత్తగా విధుల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. షాపింగ్, క్రికెట్ వంటి అంశాల్లో 50 శాతానికి పైగా సమాచార సేకరణ భారత్ నుంచే ఉంటోందని ఆయన తెలిపారు. అమెరికాలో మ్యాపింగ్ సేవల కోసం నోకియాతో ఒప్పందం చేసుకున్నామని, ఈ ఏడాది ఆఖరులో ప్రవేశ పెడతామని చెప్పారు. భారత్‌లోనూ ఇటువంటి సేవలు ప్రారంభిస్తే నోకియాతోనే అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు.
వీటితోపాటు యాహూ అల్గారిధమ్, గూగుల్ అల్గారిధమ్ రెండు కొంచెం సమానంగా ఉన్నప్పటికీ కొన్నింటిలో మాత్రం తేడా వస్తుంది. యాహూ ఎక్కువగా ర్యాంకింగ్ అల్గారిధమ్ మీద దృష్టిని నిలిపింది. యాహూ నెలకుగాను 350మిలియన్ యూజర్ల ఇన్పర్మేషన్‌ని అందిస్తుందని తెలిపారు. ఇది గూగుల్‌తో పోల్చుకున్నట్లైతే చాలా ఎక్కువ అని యాహూ ప్రతినిధి వెల్లడించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి