వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు వైపు బిజెపి నేత, సోనియా రాజకీయ సలహాదారుతో భేటీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gopinath Munde
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కాంగ్రెసులో చేరడానికి మానసికంగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ముంబయి నుండి న్యూఢిల్లీ వచ్చిన ముండే బిజెపి నేతలను ఎవరినీ కలవకుండా కేవలం కాంగ్రెసు నేతలను మాత్రమే కలిసినట్లుగా తెలుస్తోంది. భాజపా సీనియర్ నేత, మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానిని కూడా కలవలేదు. గోపీనాథ్ ముండే మనసు కాంగ్రెసు వైపు లాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి సీనియర్ నాయకుడు చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్‌తో కలిసి గోపీనాథ్ ముండే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిసినట్లుగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కలవడం నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేదు.

ముండే విషయంపై పార్టీ అధిష్టానానికి విన్నవించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ పాటిల్‌ను గత మంగళవారం రాత్రి కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే నితిన్ గడ్కరీ ఇష్యూయే గోపీనాథ్ అసంతృప్తికి కారణం అని బిజెపి వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గడ్కరీ రాష్ట్ర రాజకీయాల్లో గోపీనాథ్ కన్నా జూనియర్. అయితే నితిన్ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ క్యాడర్‌లో కూడా తన ప్రాధాన్యత క్రమంగా తగ్గినట్టుగా ముండే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముండేకు సన్నిహితుడు అయిన కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ కూడా ఢిల్లీ వెళ్లారు.

English summary
Sulking BJP leader Gopinath Munde appears moving closer to the Congress. An indication to this effect was available on Wednesday as Munde has not met any BJP central leaders especially L K Advani after his arrival here on Tuesday night from Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X