వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవన్నీ ఊహాగానాలే, పార్టీని వీడను: బిజెపి సీనియర్ నేత గోపినాథ్ ముండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gopinath Munde
న్యూఢిల్లీ: తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గోపినాథ్ ముండే బుధవారం సాయంత్రం స్పష్టం చేశారు. బిజెపి లోక్ సభా పక్షనేత సుష్మాస్వరాజ్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాను పార్టీ వీడుతానని వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన కొట్టి పారేశారు. తాను ఏ కాంగ్రెసు నేతతో చర్చలు జరపలేదన్నారు.

కాగా అంతకుముందు గోపీనాథ్ ముండే కాంగ్రెసు పార్టీకి దగ్గరువుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెసులో చేరడానికి మానసికంగా సిద్దమయ్యారని, ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి ముంబయి నుండి న్యూఢిల్లీ వచ్చిన ముండే బిజెపి నేతలను ఎవరినీ కలవకుండా కేవలం కాంగ్రెసు నేతలను మాత్రమే కలిశారని వార్తలు వచ్చాయి. గోపీనాథ్ ముండే మనసు కాంగ్రెసు వైపు లాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి సీనియర్ నాయకుడు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్‌తో కలిసి గోపీనాథ్ ముండే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిసినట్లుగా కూడా ఊహాగానాలు వచ్చాయి.

English summary
BJP senior leader Gopinath Munde condemned yester day that he will join in congress party rumors. He talk with media after meeting Sushma Swaraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X