వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో కొత్త విద్య నేర్చుకుంటున్న కనిమొళి: క్యాండిల్ తయారీలో శిక్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanimozhi
తీహార్: తమిళనాడుకు చెందిన కలైంజ్ఞర్ టీవీకి అక్రమంగా డబ్బులు తరలించారనే నేరారోపణలో తీహార్ జైలుకు వెళ్లిన తమిళనాడు పార్లమెంటు సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి జైలులో ఏం చేస్తుందని అడిగితే ఆమెకు ఇష్టమైన సాహిత్యాన్ని రాస్తుందని టక్కున సమాధానం చెబుతారు ఎవరైనా. తండ్రిలాగే కనిమొళికి సాహిత్యంపై మక్కువ ఎక్కువ. అలాంటి ఆమె జైలులో సాహిత్యం రాయకుండా చిన్న తరహా పరిశ్రమ వస్తువు తయారీ నేర్చుకుంటుందంట. జైళ్లలో ఉండే వారికి జైలు అధికారులు ఇంట్లోనే తయారు చేసుకొనే వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తారు.

కనిమొళి కూడా కొవ్వొత్తుల తయారీ శిక్షణలో బిజీగా ఉందంట. సుమారు నెలరోజులుగా ఇక్కడే ఉంటున్న కనిమొళి అప్పటి నుండి కొవ్వత్తుల తయారీని నేర్చుకుంటుందంట. తోటీ ఖైదీల నుండి ఆమె ఈ శిక్షణ పొందుతుందంట. కాగా బుధవారం తీహార్ జైలులో కనిమొళిని కలుసుకున్న కరుణానిధి విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary
Tamilanadu former CM Karunanidhi's daughter, MP Kanimozhi is seeking candle making in teehar jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X