హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి గ్రూపు రాజకీయాల వ్యూహం, సమన్వయ కమిటీ ఏర్పాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసులో తనదైన గ్రూపును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు, కింది స్థాయి నాయకత్వం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోకుండా చర్యలు ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులు తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా తనదైన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు ఒత్తిడి రాజకీయాలను నడిపించాలనే ఎత్తుగడలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు వంటి ఇతర పార్టీల్లో చేరకుండా చూడడానికి ఆయన ఐదుగురు సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ కమిటీ సభ్యులు జిల్లాలవారీగా చర్చలు జరిపి, కాంగ్రెసులోకి వచ్చేలా చూస్తారు. తన వర్గానికి చెందినవారికి ఏదో విధమైన ప్రయోజనం కలిగేలా చూడాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చే వారికి ప్రయోజనం చేకూర్చడం వల్ల తనపై నమ్మకం కుదురుతుందని ఆయన భావిస్తున్నారు.

కాగా, రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజారాజ్యం విలీన సభ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి.

English summary
Prajarajyam party president Chiranjeevi wants to maintain his own group in Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X