కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంకు చేదు అనుభవం: బహిరంగ సభను బహిష్కరించిన కాంగ్రెసు నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కర్నూలు: కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి బహిరంగ సభను కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులు శనివారం బహిష్కరించారు. ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెసు నాయకుల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన బాధ్యతలను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డికి అప్పగించారు. దీంతో చల్లా రామకృష్ణా రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. దీంతో చల్లా రామకృష్ణా రెడ్డితో పాటు జడ్‌పిటిసీలు, ఎంపిటీసులు, మార్కెట్ యార్డు చైర్మన్లు ముఖ్యమంత్రి బహిరంగ సభను బహిష్కరించారు.

తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్లిన కాటసాని రాంరెడ్డి ఆ తర్వాత వెనక్కి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం నేపథ్యంలో కాంగ్రెసులో కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. గత ఎన్నికల్లో కాటసాని రాంరెడ్డిపై పోటీ చేసిన కాంగ్రెసు నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరగడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చల్లా వర్గం ముఖ్యమంత్రి బహిరంగ సభను బహిష్కరించింది.

అంతకు ముందు ముఖ్యమంత్రి నందికొట్కూరు శాసనసభా నియోజకవర్గంలోని మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా నుంచి నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

English summary
Congress leader Challa Ramakrishna Reddy followers boycotted CM Kiran Kumar Reddy's public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X