kiran kumar reddy katasani ram reddy challa ramakrishna reddy kurnool కిరణ్ కుమార్ రెడ్డి కాటసాని రాంరెడ్డి కర్నూలు
సిఎంకు చేదు అనుభవం: బహిరంగ సభను బహిష్కరించిన కాంగ్రెసు నేతలు

తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్లిన కాటసాని రాంరెడ్డి ఆ తర్వాత వెనక్కి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం నేపథ్యంలో కాంగ్రెసులో కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. గత ఎన్నికల్లో కాటసాని రాంరెడ్డిపై పోటీ చేసిన కాంగ్రెసు నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరగడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చల్లా వర్గం ముఖ్యమంత్రి బహిరంగ సభను బహిష్కరించింది.
అంతకు ముందు ముఖ్యమంత్రి నందికొట్కూరు శాసనసభా నియోజకవర్గంలోని మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా నుంచి నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.