• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రెడ్లంతా జగన్ వైపన్న కాపునాడు, కడపలో కాపు వర్సెస్ రెడ్లు!

By Srinivas
|

YS Jagan
హైదరాబాద్: కడప జిల్లాలోనూ కాపు వర్సెస్ రెడ్డి గొడవలు ప్రారంభం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. పిఆర్పీ నాయకుడు సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చేందుకు వీల్లేదన్న కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేసిన డిమాండ్ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇది రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా మారుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌పై రెడ్ల పెత్తనమేంటంటూ కాపునాడు శనివారం ప్రశ్నించింది. ఈ ప్రకటనలో పేర్కొన్న అంశాలు రెండు వర్గాల మధ్య విభేదాలకు తెరలేపాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈ రెడ్ల పెత్తనమేంటి? అసలు రెడ్లు కాంగ్రెస్‌లో ఉన్నారా అనే సందేహం కాపునాడు వ్యక్తం చేసింది.

అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో కలసి వేరు కుంపటి పెట్టుకున్నారుగా అని ప్రశ్నించారు. రాయలసీమలో బలిజలు బలంగా ఉన్నారని.. లీడర్లు రెడ్లయితే ఓటర్లు బలిజలేనని అన్నారు. ఇంతకాలం బలిజల భుజాల మీద రెడ్లు స్వారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ పుణ్యమాని రాష్ట్రమంతా అన్ని శాఖల్లో ముఖ్యపదవులు వారివేనన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఈ సందర్భంగా ప్రసాద్‌రావు కోరారు.

English summary
Kapunadu fired at Kamalapuram MLA Veera Siva Reddy yester day for obstucting minister post to PRP senior leader C.Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X