వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రత్నాకర్‌ను విచారించిన పోలీసులు: పొంతన లేని సమాధానాలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ratnakar
అనంతపురం: జిల్లాలోని కొడికొండ చెక్ పోస్టు వద్ద ఇటీవల పట్టుబడిన రూ.35 లక్షలు తదితర విషయాలపై పోలీసులు సత్యసాయి ట్రస్టు సభ్యుడు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సోదరుడి తనయుడు రత్నాకర్‌పై శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఐదు గంటలు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్ట్ బిల్డింగ్‌లో విచారణ జరిపారు. హిందూపురం డిఎస్పీ కోలార్ కృష్ణ, హిందూపురం వన్‌టౌన్ సీఐ బి.శ్రీనివాసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు విచారణ కొనసాగింది. పోలీసులు రత్నాకర్ నుంచి లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు.

రూ.35 లక్షలు ఎవరికి సంబంధించినది? ఎక్కడి నుంచి ఎక్కడికి పంపుతున్నారు?' అని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు రత్నాకర్ పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ నగదు 12 మంది వ్యక్తులకు సంబంధించినదని, తనకు సంబంధం లేదని అలాగే, బాబా మహా సమాధి నిర్మాణం కోసం ఆ డబ్బు సేకరించామని చెప్పినట్లు సమాచారం. కాగా పుట్టపర్తి నుంచి బెంగుళూరుకు అక్రమంగా రూ.35లక్షలు తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు హిందూపురం ఆదాయపు పన్ను శాఖాధికారి సదానందం శనివారం నోటీసులు జారీ చేశారు. కోర్టు అనుమతి తీసుకుని ఈ నోటీసులు ఇచ్చారు.

English summary
Ananthapur district police questioned Sathya Sai Trust member Ratnakar yester day about RS.35 lacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X